బంగాల్లో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు తారస్థాయికి చేరాయి. తాజాగా ముర్షీదాబాద్ జిల్లాలోని బెల్దంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌కు నిప్పంటించారు వేలాది మంది నిరసనకారులు. కర్రలు పట్టుకుని రైళ్లకు ఎదురుగా వెళ్లారు. అనంతరం కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడికి దిగారు.
"నిరసనకారులు ఒక్కసారిగా స్టేషన్లోకి ప్రవేశించి.. ప్లాట్‌ఫామ్, 2-3 భవనాలు, రైల్వే కార్యాలయానికి నిప్పంటించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆర్పీఎఫ్ సిబ్బందిని దారుణంగా కొట్టారు."
- ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి.
ఆందోళనల వల్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లింల జనాభా అధికం.
ఇదీ చూడండి:- 'పౌర' సెగ: కోల్‌కతాలో జాతీయ రహదారి దిగ్బంధం