కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీను మేరఠ్లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. 'పౌర' నిరసనల్లో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ఇరువురినీ పట్టణం బయటే పార్తాపుర్ వద్ద నిలిపేశారు.
తమను అనుమతించాలని ప్రియాంక, రాహుల్ విజ్ఞప్తి చేసినా పోలీసులు ససేమిరా అన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎలాంటి కారణం చెప్పకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.
ఆదేశాలను చూపాలని మేం పోలీసులను అడిగాం. కానీ వాళ్లు అవేం చూపించలేదు. బదులుగా మమ్మల్ని తిరిగివెళ్లాలని చెప్పారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఉత్తర్ప్రదేశ్లో పౌర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో సుమారు 17 మంది మరణించారు. మేరఠ్లోనే మృతి చెందారు. బిజ్నూర్లో మృతుల కుటుంబాలను ప్రియాంక ఆదివారం కలిసి పరామర్శించారు.