'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుండటంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింస నుంచి... ప్రజల దృష్టిని మరల్చేందుకే తన వ్యాఖ్యలపై భాజపా రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పేది లేదని దిల్లీలో తేల్చిచెప్పారు.
తన ప్రసంగంలో రేప్ ఇన్ ఇండియాతో పాటు హింస, ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల గురించి కూడా ప్రస్తావించానని.. మోదీ సర్కారు వాటిపైనా స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. భాజపా ప్రభుత్వం కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మహిళలపైనా హింసను ప్రేరేపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.