కర్ణాటక బెళగావిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి కోర్టు ఆవరణలోనే దేహశుద్ధి చేశారు స్థానికులు.
26 ఏళ్ల సునీల్ బాలనాయిక అనే వ్యక్తి.. బెళగావి జిల్లాలోని కడోలీ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే న్యాయస్థానం ఎదుట బాలిక బంధువులు, నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. కోర్టు నుంచి బయటికి తీసుకువచ్చే సమయంలో ఒక్కసారిగా పోలీసులను దాటి సునీల్‌పై దాడి చేశారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు దాడి చేసిన వారిలో కొందరిని అరెస్ట్ చేశారు పోలీసు. కామాంధుడిని దండిస్తే అరెస్ట్ చేయడం ఏమిటంటూ.. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు నిరసనకారులు. రాస్తారోకో చేసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'గడ్డం గ్యాంగ్' సేవ గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!