మూడు రోజుల థాయ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకాక్ చేరుకున్నారు. 14వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. దీనితోపాటు ఆసియాన్ ఇండియా సదస్సుకు హాజరవుతారు. థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ ఛాన్ ఓ ఛా ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు.
ఆదివారం మోదీ-ప్రయూత్ల మధ్య సమావేశం జరగనుంది. వాణిజ్యం, తీరప్రాంత భద్రత, అనుసంధానం తదితర అంశాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించడమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగనుంది.
గురునానక్ 550వ జయంతి కార్యక్రమానికి కూడా మోదీ హాజరవుతారు. థాయిలాండ్లో స్థిరపడిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇదీ చూడండి: భాజపా- 'రాష్ట్రపతి పాలన' వ్యాఖ్యలపై శివసేన ఫైర్