బంగాల్లోని బర్ధమాన్ రైల్వే స్టేషన్ భవనంలోని ఓ భాగం కుప్పకూలింది. ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మరో నలుగురికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు పూర్తయ్యాయని.. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోలేదని తూర్పు రైల్వే అధికారి వెల్లడించారు. రాత్రి 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు మరో అధికారి తెలిపారు.
కోల్కతాకు 95కిమీ దూరంలో ఉంది బర్ధమాన్ రైల్వే స్టేషన్. రద్దీగా ఉండే హౌరా-న్యూ దిల్లీ రైళ్ల రాకపోకలు ఈ స్టేషన్ మీదుగానే సాగుతాయి.