ETV Bharat / bharat

అదిరిందయ్యా మరియప్పన్​.. మెప్పిస్తోంది 'లైబ్రరీ సెలూన్​'!

తమిళనాడులో సెలూన్​నే లైబ్రరీగా మార్చాడో పుస్తక ప్రియుడు. తాను చడవడమే  కాదు, తన దుకాణానికి వచ్చిన వారూ తప్పకుండా చదవాలని పట్టుబట్టాడు. ఆఖరికి కస్టమర్లమందరూ పుస్తక పఠనంలోని మాధుర్యాన్ని చవి చూసేలా చేశాడు. ఎలా అంటారా... అయితే, ఈ కథనం చదవాల్సిందే!

Pon Mariappan runs a library with over 200 books in his saloon shop in Millarpuram, Thoothukudi district.
అదిరిందయ్యా మరియప్పన్​.. మెప్పిస్తోంది 'లైబ్రరీ సెలూన్​'!
author img

By

Published : Dec 22, 2019, 7:32 AM IST

అదిరిందయ్యా మరియప్పన్​.. మెప్పిస్తోంది 'లైబ్రరీ సెలూన్​'!

తమిళనాడు తూత్తుకుడిలో ఓ క్షౌరశాల గ్రంథాలయాన్ని తలపిస్తోంది. ఈ కాలం యువకులకు పుస్తక పఠనం అలవాటు చేయాలన్న ఏకైక లక్ష్యంతో తన దుకాణాన్నే లైబ్రరీగా మార్చేశాడు పొన్​​ మరియప్పన్.

కేశాల బాహ్య సౌందర్యాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాదు, మెదడుకు కాస్త మేత కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాడు మరియప్పన్​. అందుకే, 200కు పైగా పుస్తకాలు తన దుకాణంలో ఏర్పాటు చేసి, 'లైబ్రరీ సెలూన్'​ను సృష్టించాడు.

తన వినూత్న ఆలోచనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి సైతం మరియప్పన్​ దుకాణాన్ని సందర్శించి, అతని సేవలను ప్రశంసించారు.

"ఇక్కడికి క్షౌరానికి వచ్చే విద్యార్థులు కాసేపు నా లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసి చదువుతారు. కొందరు చదవరు. కానీ, అందరూ చదవాలని నేను కోరుకున్నాను. అందుకే, 2020 జనవరి నుంచి ఒకరి సాధారణ క్షౌరానికి రూ.80 ధర ఖరారు చేశాను. అదీ ఎక్కువ అనిపిస్తే రూ. 50కి కూడా క్షౌరం చేయించుకోవచ్చు. ఎందుకంటే, నా షాపుకు వచ్చేవారు'చదవడం అనే కళ'ను నేర్చుకోవడమే నాకు ముఖ్యం."

-మరియప్పన్, సెలూన్​ నిర్వహకుడు​

ఇక వినియోగదారులు మొదట విముఖత చూపినా.. మరియప్పన్​సంకల్పానికి తలవంచక తప్పలేదు. ఇప్పుడు క్షౌరానికి వచ్చే ప్రతి కస్టమర్​ పుస్తక పఠనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

"ఇక్కడికి వచ్చే చాలా మంది కుర్రాళ్లు తమ మొబైళ్లకే అతుక్కుపోయి సమయం వృథా చేస్తారు. కానీ మరియప్పన్ అన్న ఈ లైబ్రరీ పెట్టినప్పటి నుంచి కాస్త పుస్తకాలు తీసి చదువుతున్నారు. కానీ, యువత అంత ఇష్టంగా చదవడంలేదు. అలాంటి వారికి ఆసక్తి పెంచేందుకు ఆయన ఓ రిజిస్టర్​ ఏర్పాటు చేసి, వారికి లాటరీ ద్వారా బహుమతులు అందిస్తున్నాడు. అన్న ప్రతి వినియోగదారుడ్ని పాఠకుడిగా తీర్చిదిద్దాడు."

-వినియోగదారుడు

ఇదీ చదవండి:ఫోన్​ మాట్లాడుతూ భవనం పైనుంచి పడి మహిళ మృతి

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 21 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1246: Estonia Johnson AP Clients Only 4245841
UK PM on pre-Christmas visit to troops in Estonia
AP-APTN-1242: West Bank Abbas ICC AP Clients Only 4245840
Palestinian president on ICC war crimes probe
AP-APTN-1235: Ivory Coast Macron AP Clients Only 4245839
French president attends sporting event in Abidjan
AP-APTN-1112: Lebanon Politics AP Clients Only 4245836
New Lebanon PM begins parliamentary consultations
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.