ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చరవాణి సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి నేతలు ఆకాంక్షించారని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇరువురూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నట్లు సమాచారం.
'విశ్వాసం, గౌరవంపైనే..'
భారత్-అమెరికా మధ్య సంబంధాలు విశ్వాసం, పరస్పర గౌరవం, అవగాహనపైనే ఇరుదేశాల మైత్రి ఆధారపడి ఉందని మోదీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా గతేడాది సాగిన పురోగతిని ట్రంప్ వద్ద మోదీ ప్రస్తావించారు. ఇరుదేశాలకు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడికి తెలిపారు.
'సంతృప్తికరం'
గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య బంధాల్లో పురోగతిపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారని సమాచారం.
ఇదీ చూడండి: రూ.58 వేలు విలువైన పరికరం రూ.500కే తయార్!