ETV Bharat / bharat

'నిత్యావసరాల ధరలపై మౌనమేల మోదీ?'

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై మోదీ సర్కార్​ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్. తగిన చర్యలు తీసుకునేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

surjewala
రణ్​దీప్ సుర్జేవాలా
author img

By

Published : Jan 14, 2020, 4:05 PM IST

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ధరల పెరుగుదల అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మార్గ సూచీ ప్రకటించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆహారపదార్థాల ధరల పెరుగుదలపై ప్రధాని నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ద్వేషం, విభజన అంశాలతో మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశాభివృద్ధిపై ప్రధాని దృష్టిసారించాలని ట్విట్టర్​లో సూచించారు సుర్జేవాలా.

"పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించే దిశగా ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. రానున్న ఒకటి, రెండు నెలల్లో ధరలు తగ్గించేందుకు ఏం చేస్తారో చెప్పాలి."

-రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: సీఏఏపై సత్య నాదెళ్లకు మీనాక్షి స్ట్రాంగ్​ కౌంటర్​

New Delhi, Jan 14 (ANI): Massive fire broke at a footwear manufacturing unit in Delhi's Lawrence Road on January 14. At least 26 fire tenders reached at the spot to douse the fire. The reason of fire is yet to be ascertained. Further details are awaited.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.