ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఝార్ఖండ్‌లో రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. కుంతి జిల్లాలోని బిర్సా కళాశాల వేదికగా ఉదయం 11 గంటలకు ఓ ర్యాలీలో పాల్గొంటారు మోదీ. అనంతరం జంషెడ్‌పుర్ స్టీల్ మైదానంలో జరిగే రెండో ర్యాలీకి ఆయన హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జంషెడ్‌పుర్ తూర్పు స్థానం నుంచి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పోటీ చేయనున్నారు. రఘుబర్కు పోటీగా ఆయన కేబినెట్లో మాజీ సహచరిణి అయిన సరయూ రాయ్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని ప్రచారం చేయనున్నారు.
2014లో జంషెడ్‌పుర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సరయూ ఈ సారి రఘుబర్తో పోటీ పడేందుకే తూర్పు డివిజన్ నుంచి నామినేషన్ వేశారని సమాచారం. రాయ్‌కు మద్దతిస్తూ నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు పలికింది. అయితే కాంగ్రెస్ పార్టీ గౌరవ్ వల్లభ్ పంత్‌ను ఈ స్థానం నుంచి బరిలో దింపింది.
ఝార్ఖండ్‌లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రఘుబర్ దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి రెండో దఫాలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 20న అన్ని దఫాల పోలింగ్ ముగుస్తోంది. 23వ తేదిన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇదీ చూడండి: కర్ణాటకీయం 2.0: చెలిమికి హస్తం సై-యోచనలో జేడీఎస్