వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందటంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్. ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.
" పౌరసత్వ చట్ట సరవణ బిల్లు అనేది భారత రాజ్యాంగంపై దాడి. దీనికి మద్దతు ఇచ్చే వారు ఎవరైనా మన దేశ పునాదులపై దాడి చేసి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే."
- రాహుల్ గాంధీ.
మూర్ఖత్వం, సంకుచిత మనస్తత్వం...
పౌరసత్వ బిల్లు విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోమవారం అర్ధరాత్రి లోక్సభలో బిల్లు ఆమోదం పొందటం ద్వారా మత దురభిమానం, సంకుచిత మనస్తత్వంతో కూడిన దేశ పరిస్థితి బయటపడిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్ రాజకీయ నేతల విడుదల మా చేతుల్లో లేదు'