పాక్ సైన్యం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి రాంపుర్ సెక్టార్లో పాక్ జవాన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ భారత సైన్యాధికారి సహా ఓ మహిళ మృతి చెందింది.
దీటుగా సమాధానం
పాక్ సైన్యం దుశ్చర్యను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. ఉరి గ్రామంలోని హజిపీర్ ప్రాంతంలో ఉదయం 11.30 గంటల సమయంలో పాక్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దు
కథువా జిల్లాలో మంగళవారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు వద్ద గ్రామాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. ఈ దాడులకు భారత్ సైన్యం దీటుగా సమాధానం ఇచ్చింది. హిరానగర్ సెక్టార్‌లోని చంద్వా బెల్ట్ ప్రాంతంలో పాక్ కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : మరోసారి పాక్ దుర్నీతి.. కాల్పుల్లో మహిళ మృతి