పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా అసోంవాసుల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా సోనిత్పుర్లోని దేకియాజులి వద్ద ఓ ఆయిల్ టాంకర్‌కు నిప్పంటించారు నిరసనకారులు. ఈ ట్యాంకర్ ఖాళీ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
భారీ ఎత్తున నిరసనలు...
పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ అసోం వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి రాష్ట్రంలోని 30 విద్యార్థి సంఘాలు. అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు.
కామక్య రైల్వే స్టేషన్లో ట్రాక్‌పై బైఠాయించి రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు ఏజేవైసీపీ నిరసనకారులు. 36 గంటలపాటు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: తూర్పు, ఈశాన్య భారతంలో మిన్నంటిన 'పౌర' ఆగ్రహం