కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో అణువణువు అందరికీ తెలియాలని ఏమీ లేదు. ఎక్కడ పోలీసుల గస్తీ ఉంటుందో, ఎక్కడ నిఘానేత్రాల భద్రత కొరవడిందో కొత్త వ్యక్తులకు ఎలా తెలుస్తుంది చెప్పండి? అలాంటివారికి ఉపయోగపడేలా ఓ మ్యాప్ తయారు చేసింది బెంగళూరుకు చెందిన నుపుర్ పాట్నీ. ఆమె ఫైనార్ట్స్ విద్యార్థిని. ‘ఇట్స్ నాట్ మై ఫాల్ట్’ పేరుతో ఓ వినూత్నమైన ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టు బెంగళూరు నగరంలో మహిళలపై దాడులు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలన్నింటినీ గుర్తించి, చూపిస్తుందన్న మాట. నగరంలోని మహిళలకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను తెలుసుకుని ఈ మ్యాప్‌ని తయారు చేసింది నుపుర్. ఈ ప్రాజెక్టు అమ్మాయిలు ప్రమాదకర ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
నుపుర్ తన ప్రాజెక్టును స్థానిక పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ‘ఈ మ్యాప్ అందించే సమాచారం మాకెంతో ఉపయోగపడుతుంది. ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి సీసీ కెమెరాలు పెట్టేందుకు సహాయపడుతుంద’ని వారు చెబుతున్నారు.
ఇదీ చూడండి : 'ఉన్నావ్ బాధితురాలికి రక్షణ ఎందుకు కల్పించలేదు?'