దేశంలో విదేశీయులెవరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా? అని ప్రశ్నించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అందుకే జాతీయ పౌరసత్వ జాబితాను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎంతమంది విదేశీయులు ఉన్నారు, వీరంతా ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలుసుకోవచ్చని రాజ్‌నాథ్ చెప్పారు. ఝార్ఖండ్ ఉక్కు నగరం బొకారోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాతి, మతాల ప్రాతిపదికన భాజపా భేదభావం సృష్టిస్తుందని కొంతమంది చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.
ఏ శక్తి ఆపలేదు
అయోధ్య గడ్డపై, ఎక్కడైతే రాముడు జన్మించాడో అక్కడ ఘనమైన మందిరాన్ని నిర్మించడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదన్నారు రాజ్‌నాథ్.
ఇదీ చూడండి: 'అయోధ్య ముగిసిన అధ్యాయం.. రివ్యూ పిటిషన్ ఎందుకు?'