ETV Bharat / bharat

'ఫడణవీస్​ సీఎం అని ముందే చెప్పాం.. శివసేనవి కొత్త కోరికలు'

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ కమలదళపతి అమిత్​ షా ఈ అంశంపై తొలిసారి స్పందించారు. భాజపా-సేన కూటమి నెగ్గితే దేవేంద్ర ఫడణవీస్​ సీఎం అని ముందే చెప్పామని స్పష్టం చేశారు. శివసేన కొత్త డిమాండ్లు లేవనెత్తిందని ఆరోపించారు.

'ఫడణవీస్​ సీఎం అని ముందే చెప్పాం.. శివసేనవి కొత్త కోరికలు'
author img

By

Published : Nov 13, 2019, 7:38 PM IST

Updated : Nov 13, 2019, 8:09 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కరవైన వేళ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేనపై ఆరోపణలు గుప్పించారు. మహాకూటమి విజయం సాధిస్తే... దేవేంద్ర ఫడణవీస్​ సీఎం అవుతారని ఎన్నికల ప్రచార సభల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, తాను పలుమార్లు చెప్పినట్లు ఏఎన్​ఐ ముఖాముఖిలో షా గుర్తుచేశారు.

'ఫడణవీస్​ సీఎం అని ముందే చెప్పాం.. శివసేనవి కొత్త కోరికలు'

"భాజపా, శివసేన కూటమి అధికారంలోకి వస్తే దేవేంద్ర ఫడణవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని శాసనసభ ఎన్నికల ప్రచారంలో నేను వంద సార్లు చెప్పాను. ప్రధానమంత్రి అనేక సార్లు చెప్పారు. స్వయంగా దేవేంద్ర ఫడణవీస్ కూడా చాలా సార్లు వెల్లడించారు. అప్పుడు ఈ వ్యాఖ్యలను ఎవరూ వ్యతిరేకించలేదు. శివసేన నుంచి ఇప్పుడు వచ్చిన డిమాండ్లపై మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. తగిన సమయంలో భాజపా దీని గురించి ఆలోచిస్తుంది. రాష్ట్రపతి పాలన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం కేవలం ప్రజల సానుభూతి పొందేందుకు తప్ప మరొకటి కాదు.

ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సరిపడా సమయం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. నిజానికి ఏ రాష్ట్రానికీ ఇవ్వని సమయం మహారాష్ట్ర గవర్నర్​ ఇచ్చారు. 18 రోజుల సమయం ఇచ్చినా... భాజపా, శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ ఎవరూ ముందుకురాలేదు. ఇప్పుడైనా సంఖ్యా బలమున్నవాళ్లు గవర్నర్​ను కలవవచ్చు. అన్నీ తెలిసిన సీనియర్​ న్యాయవాది కపిల్ సిబల్​ లాంటి వాళ్లు చిన్నపిల్లల వాదనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు."

- అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'మహా'ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్​తో ఠాక్రే చర్చలు

Indore (MP), Nov 13 (ANI): Team India on November 13 practiced and improved their skills ahead of first test match against Bangladesh team in Indore. The two Test matches will be played in Indore and Kolkata on November 14 and 22 respectively. India will host their first ever pink-ball test match at Eden Gardens in Kolkata from November 22. All eyes are already on the second test between India and Bangladesh.
Last Updated : Nov 13, 2019, 8:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.