ETV Bharat / bharat

ఆ ఊరిలో గుడిసెల్లేవు- కారణం ఆయనే! - shanmugan odanturai

ఆ గ్రామంలో ఒక్క గుడిసె కూడా కనపడదు. అక్కడ ఉన్నవన్నీ కాంక్రీట్​ బిల్డింగులే. ఆ ఉరిని గుడిసెల్లేని గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆయన సంకల్పమే ఇందుకు కారణం. ఇంతకి ఎవరాయన? ఆ గ్రామం ఎక్కడుంది?

No huts in a village of Tamil Nadu
ఆ ఊరిలో గుడిసెల్లేవు- కారణం ఆయనే!
author img

By

Published : Nov 17, 2020, 7:36 AM IST

ఆ ఊరిలో గుడిసెల్లేవు- కారణం ఆయనే!

ఇప్పటికీ కనిపిస్తున్న పూరిగుడిసెలు.. దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలనే కాదు.. సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కులవ్యవస్థనూ ప్రతిబింబిస్తాయి. ఏ విపత్తుకైనా ధ్వంసమయ్యేవి ఆ గుడిసెలే. అసలు అలాంటి గుడిసెలే లేని గ్రామాలు తీర్చిదిద్దడం ప్రభుత్వాల గొప్పతనం కానే కాదు. సమాసమాజ నిర్మాణానికి అదో తొలిప్రయత్నం. గుడిసె.. పేదరికానికి చిహ్నంగా రాజకీయ నాయకులు భావిస్తారు. విదేశీ అధికారులు మనదేశానికి వచ్చినప్పుడు ఆ గుడిసెలు బయటికి కనిపించకుండా జాగ్రత్తపడతారు. అలాంటి ప్రాంతాల చుట్టూ గోడలు నిర్మిస్తారు. కానీ.. ఓ గ్రామంలో ఉన్న గుడిసెలన్నింటినీ కాంక్రీటు బిల్డింగులుగా మార్చాడు ఓ ప్రజాప్రతినిధి. ఆ ఊరిని గుడిసెల్లేని గ్రామంగా తీర్చిదిద్దాడు. తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలోని మెట్టుపాలయం సమీపంలో ఉంది ఒదంతురై గ్రామం. ఇక్కడ సోలార్ విద్యుత్తు, నీటి సదుపాయాలతో అన్ని ఇళ్లూ అచ్చుగుద్దినట్టు ఒకేలా కనిపిస్తాయి. ఆ గ్రామ పంచాయితీ మాజీ ఛైర్మన్ షణ్ముగం చొరవే ఇదంతా. ఊరికోసం ఏడాదికి 8 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రాన్నే ఏర్పాటు చేయించాడు. ఆ విద్యుత్తును గ్రామస్థులు వినియోగించుకోగా మిగిలినదాన్ని రాష్ట్రప్రభుత్వం నడిపే విద్యుత్ కంపెనీకి విక్రయించేవారు. గ్రామంలో 850 ఇళ్లు నిర్మించేందుకు తనకున్న రెండెకరాల భూమిని విరాళంగా ఇచ్చేశాడు షణ్ముగం. ప్రచారమేమీ చేసుకోకుండా ఒదంతురై గ్రామంలోని గుడిసెల స్థానంలో పక్కాఇళ్లు నిర్మించిన షణ్ముగం..తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా ఇతర స్థానిక సంస్థలకు ఆదర్శం. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారత్ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందంటున్న ఆయన.. గ్రామాలను విస్మరిస్తే దేశాభివృద్ధి కుంటు పడుతుందని అభిప్రాయపడుతున్నాడు.

పేదలు, అణగారిన వర్గాల వారి జీవనం మెరుగుపర్చడమే కాకుండా, కనీస సౌకర్యాలు, వసతులు కల్పించడంపైనే ఎన్నికైన ప్రతినిధులు దృష్టిపెట్టాలి. అన్ని ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల ఫలాలు 100 శాతం నాణ్యతతో అర్హులకు అందేలా చూడడం మరో బాధ్యత. పంచాయతీ అధ్యక్షుడు నిరుపేదగా మారినా ఫర్వాలేదు కానీ, ఆ ప్రాంతం ఇబ్బందులకు గురికావద్దు. ఓ వ్యక్తి ఎంత మంచివాడైనా...పని చేయడం ముఖ్యం. ఇలా ఎప్పుడైనా ఆలోచించామా? గాంధీజీ గ్రామస్వరాజ్యం ఆశయాన్ని 2020కల్లా నిజం చేయాలన్న అబ్దుల్ కలాం సంకల్పాన్ని మనం ముందే గుర్తించి ఉంటే బాగుండేది.

---ఆర్.షణ్ముగం, మాజీ పంచాయతీ అధ్యక్షుడు, ఒడంతురై

షణ్ముగం శ్రమకు ఫలితంగా నీటిసరఫరా, పక్కాఇళ్లు, పునరుత్పాదక విద్యుత్తు ఒదంతురై గ్రామస్థులకు దక్కాయి. నిర్మలా పురస్కార్, రాజీవ్‌గాంధీ పర్యావరణ పురస్కారం సహా.. ఎన్నో అవార్డులు, ప్రశంసలు ఆయనను వరించాయి. 53 దేశాలనుంచి ఉన్నతాధికారులు ఒదంతురైని సందర్శించి, తమ దేశాల్లోనూ షణ్ముగం స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తమ జీవితాలను మెరుగుపరిచేందుకు దేవుడే షణ్ముగాన్ని తమ ఊరికి పంపారని వెలుగులు నిండిన కళ్లతో చెప్తున్నారు స్థానికులు.

అప్పట్లో అద్దెగదిలో ఉండేవాళ్లం. అద్దెభారం భరించలేక గుడిసెలోకి మకాం మార్చాం. 2014లో షణ్ముగం మాకు ఇళ్లు కట్టించాడు. సోలార్ విద్యుత్తు పలకలు ఏర్పాటుచేశాడు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సహా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాడు.

---వడివేల్, ఒదంతురై వాసి

ఇంటింటికీ మరుగుదొడ్డి, సోలార్ విద్యుత్, పిల్లలకు పాఠశాలలు, మొబైల్ ఆసుపత్రి, రెషన్ దుకాణాల్లాంటి వసతులన్నీ కల్పించాడు షణ్ముగం. ఆరు నుంచి 12వ తరగతుల విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించాడు. మాకోసం చాలా చేశాడు.

---భువనేశ్వరి, ఒదంతురై వాసి

ఓ పంచాయతీ అధ్యక్షుడు.. ఆ గ్రామంలోని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించి, అందరూ స్వయంసమృద్ధి సాధించేలా చేయవచ్చని నిరూపించాడు షణ్ముగం. గ్రామీణాభివృద్ధికి ఆయన నిదర్శనం అనడం అతిశయోక్తి కాదు.

ఇదీ చూడండి:- ఆవు పేడతో మాస్కు.. ఎరువుగానూ వాడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.