క్షమాభిక్షను నిరాకరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన నిర్భయ దోషి ముకేశ్ కుమార్.. అత్యవసర విచారణకు స్వీకరించాలని అభ్యర్థించాడు. పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీం రిజిస్ట్రార్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
"ఎవరైనా మరణ శిక్షకు దగ్గరగా ఉన్నప్పుడు అంతకన్నా అత్యవసరమైనదేదీ ఉండదు. ఈ పిటిషన్ను సుప్రీం రిజిస్ట్రార్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి."
- సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం
మరణ దండన నుంచి ఉపశమనం కలిగించాలని ముకేశ్ వేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. నిర్భయ దోషులు నలుగురికి ఫిబ్రవరి 1న మరణ శిక్ష విధించాలని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.