భారత్ దిగుమతి చేసుకుంటున్న బొమ్మలు దాదాపు 67 శాతం ప్రమాదకరమని.. భారతీయ నాణ్యత మండలి(క్యూసీఐ) తెలిపింది. దిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బొమ్మలను పరీక్షించగా.. అందులో 66.9శాతం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి లేవు. కేవలం 33.1శాతం మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి.
క్యూసీఐ ఏమంటోందంటే..?
భద్రత పేరుతో అధిక స్థాయిలో ఫ్తాలెట్, భారీ మెటల్‌ను ఉపయోగిస్తున్నందునే 30 శాతం ప్లాస్టిక్ బొమ్మలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని క్యూసీఐ నివేదిక తెలిపింది. 80 శాతం వరకు ప్లాస్టిక్ బొమ్మలు యాంత్రిక, భౌతిక లక్షణాల కారణంగా విరిగిపోతున్నాయని క్యూసీఐ పేర్కొంది.
సరకు పరీక్ష తప్పనిసరి...
85 శాతం చైనా ఉత్పత్తులను శ్రీలంక, మలేషియా, జర్మనీ, హాంగ్‌కాంగ్, అమెరికా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. విదేశీ వాణిజ్య సంచాలక ప్రధాన కార్యాలయం(డీజీఎఫ్టీ) వీటి టెస్టింగ్ నివేదికలను పరీక్షిస్తూ... సరకు ఆధారిత పరీక్షను తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ప్రకటన కోసం ముసాయిదాను క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ)కు పంపించారు.
'యాంత్రికంగా విఫలమైన బొమ్మలు పిల్లలకు చర్మవ్యాధులను కలుగజేస్తాయి. అందులో వాడిన హానికరమైన రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. ఒక బాలుడు బొమ్మతో ఆడుకొంటుండగా... అందులో మంటలు ఏర్పడ్డాయి. భారత నౌకల్లో వచ్చే ప్రతి సరకు నుంచి నమూనాలను తీసుకొని పరీక్షిస్తారు. అవి విఫలమైతే నాశనమవుతాయి లేదా తయారీదారులకు తిరిగిపంపుతారు. బొమ్మల ద్వారా దేశంలో పిల్లల ఆరోగ్యం, భద్రతకు హాని కలగకుండా ఉండటానికే నౌకాశ్రయాలు నిబంధనల్ని తప్పనిసరి చేశాయి' - ఆర్పీ సింగ్, క్యూసీఐ ప్రధాన కార్యదర్శి