మహారాష్ట్ర రాజకీయాలు ప్రతిక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. దేవేంద్ర ఫడణవీస్‌కు మద్దతిస్తూ.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్‌ను ఎస్సీపీ శాసనసభా పక్షనేతగా శనివారమే తొలగించారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. ఇదే విషయాన్ని గవర్నర్ కోశ్యారీకి తెలిపేందుకు ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో గవర్నర్ అక్కడ లేనందున జయంత్ వెనుదిరిగి వెళ్లిపోయారు.
శనివారమే తొలగింపు..
కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. భాజపాకు మద్దతిచ్చి.. దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అజిత్‌ను శాసనసభాపక్ష నేత హోదా నుంచి తొలగించారు శరద్ పవార్. ఆయన స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి:ఆ రంగంలో 'అమిత్ షా'నే బెస్ట్ ఫినిషర్..!