దిల్లీలో వాయు కాలుష్యంపై పలువురు ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశం ప్రారంభం సందర్భంగా మంత్రులు, లోక్‌సభ సభ్యులు మాస్కులు ధరించి, సైకిళ్లు, ఎలాక్ట్రానిక్ కార్లు నడుపుతూ పార్లమెంట్ చేరుకున్నారు.
కాలుష్యం పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహంవద్ద ముసుగు ధరించి.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ నిరసన తెలిపారు. కర్భన ఉద్గాగారాలను తగ్గించాలని సందేశమిస్తూ భాజపా నేతలు మన్సుక్ మాండవియా, మనోజ్ తివారీ సైకిళ్లపై పార్లమెంట్‌కు చేరుకున్నారు.
కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ పార్లమెంట్‌కు ఎలక్ట్రిక్ కారులో వచ్చారు. విద్యుత్ కార్లు పర్యావరణహితమని, ప్రజలు వాటిని వినియోగించి కాలుష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:హీరోయిన్‌కు అస్వస్థత... పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు