ETV Bharat / bharat

'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'

చైనాతో భారత సంబంధాలు నూతన దిశ- నవీన శక్తితో ముందుకు సాగుతున్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. బ్రెజిల్​లో జరుగుతున్న బ్రిక్స్ 11వ శిఖరాగ్ర సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతనెలలో జరిగిన ఇరునేతల అనధికారిక భేటీని గుర్తు చేశారు మోదీ.

author img

By

Published : Nov 14, 2019, 6:14 AM IST

'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'

బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇరుదేశాల మధ్య మైత్రి నూతన దిశ-నవీన శక్తితో సాగుతోందని అభిప్రాయపడ్డారు. నెల వ్యవధిలోనే జిన్​పింగ్​ను మరోసారి భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు. చెన్నై వేదికగా జరిగిన అనధికారిక సమావేశం ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకానికి నాంది పలికిందన్నారు మోదీ.

'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'

"చెన్నైలో మన భేటీ ద్వారా నవోత్సాహం వచ్చింది. ఏ ఎజెండా లేకుండా జరిగిన నాటి భేటీలో ఇరుదేశాల సంస్కృతులు, అలవాట్లు సహా పరస్పరం అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఆ భేటీ ఎంతో సత్ఫలితాలనిచ్చింది. చెన్నై సమావేశంలో చర్చించిన ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు ఆచరణలోకి వస్తే ఇరు దేశాలకు సంబంధించి అనేక అంశాలు మరింత ముందుకు సాగుతాయి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరునేతలు విస్తృత చర్చలు జరిపారు. చైనా మద్దతిచ్చిన ఆర్​సెప్​ ఒప్పందానికి భారత్​ నిరాకరించిన అనంతరం ఇరునేతల మధ్య భేటీ జరగడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: 'శబరిమల' వివాదమేంటి? సుప్రీం తీర్పు మారుతుందా?

Mumbai, Nov 11 (ANI): While addressing a press conference in Mumbai, NCP leader Nawab Malik said that the party is waiting for Congress to take a decision. He said, "We fought elections together and whatever will be decided, it will be decided together." "Congress MLAs are in favour of supporting Shiv Sena-led government, but Congress Working Committee (CWC) is the supreme body to decide on their party line," he added. NCP core committee meeting was also held today as the Maharashtra power tussle continues.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.