సూడాన్ రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన సిరామిక్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు.
విషాద ఘటనలో పలువురు భారతీయులు మృతి చెందిన వార్త దిగ్ర్భాంతికి గురిచేసింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులందరికీ సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయ సహకారాలు అందిస్తుంది.
- ప్రధాని మోదీ ట్వీట్.
గ్యాస్ ట్యాంకర్ పేలి ప్రమాదం..
ఎల్పీజీ ట్యాంకర్ పేలి సెరామిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మరో 16మంది గల్లంతైనట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. డిసెంబరు 11న ముహూర్తం