మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో విషాదం జరిగింది. మెహ్‌కర్ తాలూకా మాలేగావ్‌లో ఓ తల్లి, తన నలుగురి కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలారు. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఎవరైనా చంపి బావిలో పడేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: ఒకే కార్డుపై ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్!