హనీమూన్ కోసం హిమాచల్ ప్రదేశ్ కులుకు వెళ్లిన ఓ నూతన జంట కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పారాగ్లైడింగ్ చేస్తూ వరుడు మరణించగా... వధువు జీవితం అగమ్యగోచరమైంది.
పది రోజుల్లోనే...
చెన్నై అమింగికరై ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల అరవింద్‌కు ఈనెల 10న ప్రీతి అనే అమ్మాయితో పెళ్లయింది. హనీమూన్ కోసం వీరిద్దరూ కులు వచ్చారు. పారాగ్లైడింగ్ చేయాలని అరవింద్ ముచ్చటపడ్డాడు. ప్రీతి ఉత్సాహపరుస్తుండగా... గాల్లోకి దూసుకెళ్లాడు వరుడు. కాసేపటికే ప్రమాదం ఎదురైంది. అరవింద్, పారాగ్లైడింగ్ పైలట్ ఒక్కసారిగా కిందపడ్డారు. అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు. పైలట్ గాయపడ్డాడు.
అరవింద్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి : శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో