పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ సోమవారం కోల్కతాలో భారీ ప్రదర్శన చేపట్టారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రెండింటిని రాష్ట్రంలో అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. కోల్కతా నగరంలో రెడ్ రోడ్ నుంచి 'జురాసాంకో ఠాగూర్ బారి' వరకు మమత నేతృత్వంలో సాగిన ర్యాలీలో వేలాది మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
"ఎన్ఆర్సీ, 'పౌర' చట్టాన్ని ఎప్పటికీ బంగాల్లో అనుమతించబోం. మేము అన్ని కులాలు, మతాలను విశ్వసిస్తాం. ఇక్కడ నివసించే వాళ్లందరూ దేశ పౌరులే. ఏ ఒక్కరు దేశాన్ని విడిచి వెళ్లరు."
- బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
బంగాల్లో గత మూడు రోజులుగా ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నేడు స్వయంగా ముఖ్యమంత్రి నిరసనల్లో పాల్గొనడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధంకర్ తప్పుబట్టారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు.