మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని విలే పార్లెలోని 13 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనంలోని ఏడు, ఎనిమిదో అంతస్థులో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
మంటలు చెలరేగినట్లు సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. 8-10 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. సాయంత్రం 7:10 గంటల సమయంలో ఈ ప్రమదం జరిగినట్లు తెలుస్తోంది.