హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరోమారు భాజపాకే అధికారం కట్టబెట్టాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 46 స్థానాల కంటే... దాదాపు 30 సీట్లు భాజపా అధికంగా గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... కాంగ్రెస్‌కు 20 స్థానాలు కూడా రావని తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
సర్వే సంస్థ | భాజపా | కాంగ్రెస్ | ఇతరులు |
టైమ్స్ నౌ | 71 | 11 | 8 |
జన్ కీ బాత్ | 57 | 17 | 16 |
న్యూస్ ఎక్స్ | 77 | 11 | 2 |
పోల్ ఆఫ్ పోల్స్ | 63 | 16 | 11 |