మహారాష్ట్ర వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు
మహారాష్ట్ర వ్యవహారంపై రేపు ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. రెండో రోజు దాదాపు గంటన్నరసేపు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్‌ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు ఆలకించింది.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్- శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంయుక్త పిటిషన్ దాఖలు చేశాయి. 24 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని కూటమి తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఈ వాదనను భాజపా తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. వాదనలు ఆలకించిన సుప్రీం రేపు ఉదయం 10.30కు తీర్పును వాయిదా వేసింది.