రాత్రిబవళ్లు తేడా లేకుండా శ్రమించిన రైతులకు పంట చేతికొస్తేనే సరైన ప్రతిఫలం దక్కినట్లవుతుంది. వారికి వరుణుడితో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ గుజరాత్ రైతులకు మాత్రం మిడతల రూపంలో సమస్య వచ్చిపడింది. పాకిస్థాన్ నుంచి వేలాది సంఖ్యలో వచ్చిన లోకస్ట్(మిడత జాతి పురుగు)లు చేతికొచ్చిన పంటను సర్వ నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా బనస్కాంత, మెహ్సానా జిల్లాల రైతులు ఈ రాక్షస మిడతల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ ప్రాంతంలో వరి, ఆముదం, ఆవాల పంటలను దెబ్బతీస్తున్నాయి.
డోలు వాయింపు.. టేబుల్ ఫ్యాన్లు..
మిడతల నుంచి పంటలను కాపాడుకునేందుక తమకు తోచిన పద్ధితిని అనుసరిస్తున్నారు గుజరాత్ రైతులు. వ్యవసాయ క్షేత్రాల్లో టైర్లకు నిప్పంటిస్తున్నారు. డోలు వాయించి, తాళాలతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. చివరకి పంటల వద్ద టేబుల్ ఫ్యాన్లు, మినిట్రక్కుతో భారీ శబ్దాలు వచ్చేలా మ్యూజిక్ సిస్టెమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మిడతల సమస్యను అధిగమించేందుకు 18 అధికారిక బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. రైతుల కోసం పత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
"రెండు రోజుల ముందే భారీగా మిడతలు వచ్చాయి. రెండు జిల్లాల పరిసర ప్రంతాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. లోకస్ట్లను నియంత్రించేందుకు 19 అధికార బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికార బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారిస్తాం. ఇప్పటివరకు 6వేల హెక్టార్లకుపైగా పంటనష్టం జరిగింది. సర్వే పూర్తయ్యాక రైతులకు పరిహారం అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి."
- ప్రాంచంద్ పర్మార్, వ్యవసాయ అధికారి.
పంటలపై ఈ తరహా దాడులు జరగడం గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. ఈ మిడతల భయంతో బనస్కాంత జిల్లా పరిసర ప్రాంత రైతులు హడలిపోతున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అబద్ధాలు చెప్పడంలో రాహుల్ దిట్ట: భాజపా