శబరిమల ఆలయంలోకి నిర్దేశిత మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చట్టం తీసుకురావడం కుదరదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వెళ్లేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
"సుప్రీం తీర్పు ప్రకారం ఆలయ ప్రవేశం మహిళల ప్రాథమిక హక్కు. కోర్టు తీర్పు అమలు చేసేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉంది"
-పినరన్ విజయన్ కేరళ ముఖ్యమంత్రి.
నిర్దేశిత వయస్సు గల మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధం వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుపై న్యాయసలహా తీసుకున్న అనంతరమే.. చట్టం చేయడం కుదరదని నిర్ణయిచినట్లు వెల్లడించారు. చట్టం తీసుకురావాలని కోరుతున్నవారు.. భక్తులను మోసం చేస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు పినరయి. తమ ప్రభుత్వం మహిళలను బలవంంతంగా శబరిమలకు పంపించదని.. వెళ్లాలనే నిర్ణయం వారి వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
10 నుంచి 50 ఏళ్లు మధ్య వయస్సు గల మహిళలను ఆలయంలోకి అనుమతిస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్పై ఈ నెలలోనే తీర్పును వెలువరించనుంది అత్యున్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి:జపాన్ ప్రధానితో మోదీ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై చర్చ