ETV Bharat / bharat

'శబరిమలకు నేరుగా రైలు మార్గం లేనిది ఇందుకే...' - తాజా వార్తలు శబరిమల

ఏటా కోట్లాది మంది దర్శనం చేసుకునే పుణ్యస్థలం శబరిమల. మాలధారణతో మండలం రోజులు దీక్ష చేసి భక్తులు పవిత్ర శబరిగిరిని దర్శిస్తారు. శబరిమల వెళ్లే భక్తుల్లో అత్యధికులు రెండు తెలుగురాష్ట్రాల వారే. అలాంటి శబరిమలకు ఇప్పటివరకు నేరుగా రైలు మార్గం ఎందుకు లేదు?

Lack of cooperation from Kerala
శబరిమలకు నేరుగా రైలు మార్గం ఎందుకు లేదు?
author img

By

Published : Jan 12, 2020, 5:01 PM IST

కేరళలోని శబరిమల అయప్ప స్వామి క్షేత్రానికి చేరుకోవాలంటే ఏ రైలు ఎక్కాలి? ఇలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే శబరిమలకు నేరుగా రైలు మార్గం లేదు. శబరిమలకు వెళ్లే భక్తులు కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్ రైల్వేస్టేషన్లలో ఏదో ఒక చోట దిగి వెళ్లాల్సిందే. అక్కడ నుంచి శబరిమలకు దాదాపు 90 కిలోమీటర్ల దూరం.

దేశంలోని ప్రధాన నగరాల్ని, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైలు మార్గాలను ఏర్పాటు చేస్తోన్న రైల్వేశాఖ.. శబరిమల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించింది. అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు?

రైల్వే మంత్రి ఆరోపణలు...

శబరిమలకు నేరుగా రైల్వే మార్గం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించడం లేదని రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే శబరిమల రైలు మార్గం ప్రాజెక్ట్​ వ్యయం 512 శాతం పెరిగిందన్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు లేఖ రాశారు గోయల్. ప్రతిపాదిత 111 కి మీ అంగమాలి- శబరిమల ప్రాజెక్ట్​ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు.

ఎప్పుడో కావాల్సింది...

ఈ ప్రాజెక్ట్​ను 1997-98 రైల్వే బడ్జెట్​లో ప్రతిపాదించారు. రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్ట్​ భూమికి రూ.50.76 కోట్లు సహా మొత్తం రూ.517.70 కోట్లు 2006 మే లో కేటాయించింది ప్రభుత్వం.

వెంటనే అంగమాలి- కలాది (7 కిమీ), కలాది-పెరుంబవూర్​(10 కిమీ) పనులు మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్​ మూలన పడింది. ప్రాజెక్ట్​ కోసం చేపట్టిన భూసేకరణపై స్థానికులు నిరసనలు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్​ పైన కోర్టులో కేసులు నమోదయ్యాయి.

భారీగా పెరిగింది...

ఈ కారణాలతో ప్రాజెక్ట్​ బడ్జెట్​ భారీగా పెరిగింది. 1997లో ఈ ప్రాజెక్ట్​ అంచనా రూ.550 కోట్లు. 2017 వచ్చేసరికి ఈ అంచనా రూ.1566 కోట్లు అయింది.

50-50 ప్రతిపాదన...

ఈ ప్రాజెక్ట్​ బడ్జెట్​ అంచనా భారీగా పెరగడం వల్ల రైల్వే నిధులు ఒక్కదాని నుంచే కేటాయించడం అసాధ్యమని రైల్వేశాఖ తెలిపింది. ఇందుకోసం ప్రాజెక్ట్​ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాలని 2011, 2012లో కేరళ సర్కారుకు లేఖ రాసింది.

2015లో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఏడాదిలోపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2017లో మరోసారి రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఎలాంటి నిర్ణయం చెప్పకపోవటం వల్ల ప్రాజెక్ట్​ను ఎటూ తేల్చని స్థితిలో రైల్వేశాఖ విడిచిపెట్టింది.

Ujjain (MP)/Indore (MP), Jan 12 (ANI): Union Railway Minister Piyush Goyal on January 12 announced a special night train joining Mahakal in Ujjain and Kashi Vishwanath in Varanasi to be launched in Indore. "An overnight train under IRCTC joining Mahakal in Ujjain and Kashi Vishwanath in Varanasi will soon be launched from here (Indore). The train will facilitate the pilgrims and also help in boosting tourism in Indore which is the most 'swachch' city," said the Railway Minister.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.