ETV Bharat / bharat

శరణార్థులను ఆదుకోవడానికే 'పౌర' చట్టం: కిషన్​రెడ్డి

పౌరసత్వ చట్ట సవరణలో భారత పౌరులకు వ్యతిరేకంగా ఒక్క అక్షరమూ లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం శరణార్థులను ఆదుకోవడం కోసం.. చాలా మానవత్వంతో ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు భారతీయులెవరూ ఎలాంటి పత్రాలు చూపాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.

kishan reddy about citizenship amendment act
శరణార్థులను ఆదుకోవడానికే 'పౌర' చట్టం: కిషన్​రెడ్డి
author img

By

Published : Dec 21, 2019, 7:23 AM IST

శరణార్థులను ఆదుకోవడానికే 'పౌర' చట్టం: కిషన్​రెడ్డి

పౌరసత్వ సవరణ చట్టంలో భారతీయులకు వ్యతిరేకంగా ఒక్క అక్షరమున్నా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులు తట్టుకోలేక దశాబ్దాల క్రితం మన దేశానికి తప్పించుకొని వచ్చి మురికివాడల్లో జీవచ్ఛవాల్లా గడుపుతున్న వారికి పౌరసత్వం కల్పించాలన్నదే ఈ చట్టం లక్ష్యమని వివరణ ఇచ్చారు. ‘‘ఇంటి నుంచి గడపదాటే ముందు ఎందుకోసం మీరు బయటికెళ్తున్నారు? ఎవరి కోసం నినాదాలిస్తున్నారు? ఆందోళనల్లో ఎందుకు పాల్గొంటున్నారు? పోలీసులపై రాళ్లెందుకు వేస్తున్నారు? వాహనాలను ఎందుకు తగులబెడుతున్నారు? అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి’’ అని ఆందోళనకారులకు హితవు చెప్పారు. దేశ వ్యాప్తంగా చేపట్టే జాతీయ పౌర పట్టికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే ఒక్క భారతదేశంలో తప్ప అన్ని దేశాల్లోనూ ఇలాంటి పట్టికలు ఉన్నాయని అన్నారు. అయితే తమ పౌరసత్వం నిరూపణకు భారతీయులు ఎవరూ ఎలాంటి పత్రాలూ చూపాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ఎవరికీ ఎలాంటి భయమూ అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. కేవలం మానవతా దృక్పథంతోనే శరణార్థులను దేశ పౌరులుగా గుర్తిస్తున్నామని, అంతకుమించి మరో కారణం లేదని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటి మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత శరణార్థుల గుర్తింపు, పౌరసత్వం మంజూరుపై విధివిధానాలు ఖరారవుతాయని చెప్పారు.

* ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఇంతగా స్పందించడానికి కారణం ఏమిటి?

మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిన్న సంఘటనను కూడా చిలవలు పలవులుగా చేసి దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. ఇదివరకు అసహనం పేరుతో అవార్డులను వాపస్‌ చేసే ఉద్యమాన్ని ఆరునెలల పాటు చేపట్టారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రక్షణ లేదు.. వెంటనే తీసేసుకోండని ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. ఇళ్లలోని బంగారానికీ లెక్క చెప్పాల్సిందేనని ప్రచారం చేశారు. ఇప్పటివరకూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన శక్తులే ఇప్పుడు సున్నితమైన అంశంపై మత పరంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు పాకులాడుతున్నాయి. దురదృష్టవశాత్తు పౌరసత్వ సవరణ చట్టంతో పెద్దగా సంబంధంలేని దిల్లీ, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు మిగిలిన ప్రాంతాల్లో అనవసరంగా విషపూరితమైన తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది ముస్లిం వ్యతిరేక బిల్లు అని ప్రజల మనసుల్లో బీజాలు నాటి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష మేధావి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఈ దేశంలోని ఏ మతం, ప్రాంతం, కులం, వర్గంవారికీ ఇబ్బంది ఉండదు.

* మీరు ఎంత భరోసా కల్పిస్తున్నా కొన్ని వర్గాలు నమ్మడం లేదు. పలువురు ఆందోళనకు గురవుతున్నారు కదా?

ప్రచార, ప్రసార సాధనాలు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఈ చట్టంలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పౌరసత్వ సవరణ చట్టంలో ఎవరికి వ్యతిరేకంగా అయిన ఒక్క అక్షరమున్నా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్‌లో ఎన్నో ఏళ్లుగా లక్షల మంది మత వివక్షకు గురయ్యారు. అక్కడి మెజార్టీ ప్రజల వేధింపులకు తట్టుకోలేక మతమార్పిడులు చేసుకొని వివాహాలు చేసుకున్నారు. ఎంతోమంది హత్యకు గురయ్యారు. చివరకు ఏ దారీలేనివారు బతుకుజీవుడా అంటూ 30-40 ఏళ్ల క్రితం భారతదేశంలోకి వచ్చి మురికివాడల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారికి పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఆ పనిని మోదీ చేస్తే వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు ఒక దేశంగా ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన బాధితులకు ఇప్పుడు భారతదేశం రావడం మినహా మరో గత్యంతరం లేదు. మానవతా దృక్పథంతో వారికి పౌరసత్వం ఇస్తున్నారు తప్పితే, దేశంలోని వారికి పౌరసత్వం తొలగించే ప్రస్తావనే ఈ చట్టంలో లేదు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలను చంపేశారనో... ఇంకోటనో అబద్ధాలు వ్యాప్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే ఆందోళనలను కాకుండా హింసను మాత్రమే అడ్డుకుంటున్నాం.

* పౌరసత్వం నిరూపించుకోవడం తలకు మించిన పని అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా? దీనికి ఏం చెబుతారు?

భారతీయ పౌరులెవ్వరూ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలూ చూపించాల్సిన అవసరంలేదు. ఏ మతం వారినీ దేశం నుంచి పంపే ప్రసక్తి ఉండదు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వారికో ప్రత్యేక పౌర పట్టిక ఉంటుంది. అలాంటి పట్టికలేని దేశం భారత్‌ ఒక్కటే. అందుకే మనదేశానికి ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా రావొచ్చు... పోవచ్చు అన్నట్లు పరిస్థితులు తయారయ్యాయి. ఇలా వచ్చేవాళ్లు తమతోపాటు ఆయుధాలు, దొంగనోట్లు, మాదకద్రవ్యాలు తీసుకొచ్చి దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణమైన స్థితి భారత్‌లో మాత్రమే ఉంది. మిగతా ఏ దేశానికి వెళ్లాలనుకున్నా అనుమతి తీసుకున్న తర్వాతే అడుగుపెట్టాల్సి ఉంటుంది. మన దేశంలోకి మాత్రం కిటికీలు, బాల్కనీలు, దొడ్డిదారులు... ఎక్కడి నుంచి వచ్చినా అడిగేవారు లేకుండాపోయింది. దీన్ని అరికట్టాల్సి ఉంది. మనదేశం తలుపుతట్టి వచ్చిన వారు వర్క్‌ పర్మిట్‌ తీసుకొని అది పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లిపోవచ్చు. అక్రమ చొరబాటుదారులకు, శరణార్థులకు ఉన్న తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తున్నాం. చొరబాటుదారుల విషయంలో ఆలోచించాల్సి ఉంది. వాళ్లను తిరిగి పంపించకుండా వారికి వర్క్‌ పర్మిట్‌ ఇవ్వడమా, ఇంకేదైనా చేయడమా అన్నది పార్లమెంటులో, బయట చర్చించి ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకుంటాం.

* చట్టం అమలుకు అనువైన నిబంధనలు ఎప్పుడు విడుదల చేస్తారు? దీని పరిధిలోకి ఎంతమంది వస్తారు?

పరిస్థితులు కుదుటపడిన తర్వాత చేస్తాం. దీనివల్ల ఎంతమందికి పౌరసత్వం లభిస్తుందన్నది స్పష్టంగా చెప్పలేం. దిల్లీలోని ఓ బస్తీలోనే 12వేల మంది శరణార్థులున్నారు. ఆ లెక్కన ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. హైదరాబాద్‌లోనూ దీని పరిధిలోకి వచ్చేవారుంటారు. కానీ సంఖ్య తక్కువ ఉంటుంది.

అసోంలో చేపట్టిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విఫలమైందంటున్నారు. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది?
అసోం ఎన్‌ఆర్‌సీ పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది. దానిపై కేంద్రం పర్యవేక్షణ లేదు. జాతీయస్థాయి ఎన్‌ఆర్‌సీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందులోని అంశాలు ఇంకా ఖరారు కాలేదు. ఆలోచన దశలోనే ఉంది.

* ఆధార్‌ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదు?

ఆధార్‌ను పౌరసత్వ పత్రంగా గుర్తించడంలేదు. దాన్ని ఎక్కడా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల పౌరసత్వం, ఆధార్‌ అన్నవి విభిన్న అంశాలు. ఆధార్‌ ఎవరికైనా ఇస్తున్నారు కాబట్టి ఒక వ్యక్తి భారతీయుడా? కాదా? అని నిర్ధారించడానికి అది ఉపయోగపడదు. మనం ఉన్న ఇంటి విద్యుత్తు బిల్లు తీసుకెళ్తే ఆధార్‌ ఇస్తున్నారు. అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేం.

ఇదీ చూడండి: 'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'

AP Video Delivery Log - 0000 GMT News
Saturday, 21 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2255: UK Parliament Black Rod News access for 24 hours only; Must give on-screen credit to 'BBC Studios'; Strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; No Archive, No Resale 4245559
Black Rod knocks to gain entry to UK Parliament
AP-APTN-2237: Ivory Coast Macron Address AP Clients Only 4245802
Macron addresses French soldiers in Ivory Coast
AP-APTN-2228: Chile Protests AP Clients Only 4245801
Protesters clash with police in Santiago
AP-APTN-2225: Lebanon Clashes AP Clients Only 4245798
Security forces, Hariri supporters clash in Beirut
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.