కేరళ ఎర్నాకుళంలో మరో ట్రాన్స్ జెండర్ వివాహం జరిగింది. జర్నలిస్టుగా పనిచేస్తున్న ట్రాన్స్ ఉమన్ హైది సాదియా, అథర్వ్ మోహన్లు వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వధూవరులను ఆశ్వీర్వదించారు.
కేరళ ప్రభుత్వం 'ఎల్జీబీటీక్యూ'... అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ల వివాహాలను చట్టబద్ధం చేస్తూ 'ప్రత్యేక వివాహ చట్టం' తీసుకొచ్చింది. సాదియా వివాహంతో కలిపి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో నాలుగు ట్రాన్స్ జెండర్ పెళ్లిళ్లు జరిగాయి.
ఇదీ చూడండి: అత్యధిక హెచ్డీ ఛానల్స్ అందించే డీటీహెచ్ ఆపరేటర్ ఇదే!