కన్నడ భాషకు జీవం పోస్తూ వందలాది మంది కళాకారులు 'యక్షగానం' కోసం ఒక్కటయ్యారు. కేవలం కన్నడలోనే అనర్గళంగా 8 గంటలపాటు ప్రదర్శన చేశారు. ఒక్క ఆంగ్ల పదాన్నీ వినియోగించలేదు. అలా వీరంతా కళారంగంలోనే సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
కర్ణాటకలోని తీర ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టమైన కళ యక్షగానం. ఈ కళతో అనేక మంది ప్రపంచవ్యాప్త కీర్తిని పొందారు. ఇందులో పీహెచ్డీ కూడా చేశారు ఎందరో పండితులు. తాము మాట్లాడే భాషలో కొంచెం కూడా తప్పులు పోకుండా... స్వచ్ఛమైన కన్నడలోనే మాట్లాడతారు కళాకారులు. వీరి స్వచ్ఛమైన కన్నడ భాషకు అందరూ మంత్రముగ్ధులైపోతారు.
"కన్నడనాట ఎన్నో కళలున్నాయి. కానీ 54 బృందాలు యక్షగానాన్ని ఎన్నో జిల్లాల్లో ప్రదర్శిస్తాయి. ఈ బృందాలు ప్రతి రోజూ యక్షగానం ప్రదర్శనలు నిర్వహిస్తాయి. ఒక్కో కార్యక్రమం 5 నుంచి 8 గంటల పాటు ఉంటుంది. యక్షగానంలో 1000 కన్నా ఎక్కువ మంది కళాకారులు పాల్గొంటారు. ఈ సమయంలో దేవీ కన్నడ భువనేశ్వరిని సుమారు 500 గంటల పాటు స్మరించుకుంటారు. ప్రాచీన కన్నడ సాహిత్యంలోని మాధుర్యాన్ని ఈ వేడుక తెలియచెబుతుంది."
- సంజీవ సువర్ణ, యక్షగాన బోధకుడు.
అయితే కన్నడ భాష ఉనికి కోల్పోతోందని కళాకారులు బాధపడుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సమయంలోనే కన్నడ గుర్తొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్, ట్విట్టర్ సాయంతో జైలు జీవితం నుంచి విముక్తి