మహిళా శక్తిని తెలిజేసేందుకు హిమచల్‌ప్రదేశ్ మండి జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒకేసారి 1008 మంది బాలికలకు 'కన్యాపూజ' నిర్వహించింది అక్కడి జిల్లా యంత్రాంగం. 'బేటీ బచావో- బేటీ పడావో' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించింది.
సమాజంలో లింగ సమానత్వం, విద్య, భద్రత, ఆరోగ్యం, గౌరవం, ఆత్మగౌరవం బాలికల హక్కులపై అవగాహన కల్పించటం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో 'బేటీ బటావో-బేటీ పడావో' ప్రచారాన్ని, 'బాలిక గౌరవ్ ఉద్యన్ యోజన'గా ప్రారంభించినట్లు వెల్లడించారు అధికారులు. బాలికల భద్రత, పర్యావరణ రక్షణ... బాలిక గౌరవ్ ఉద్యన్ యోజన ముఖ్య లక్ష్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మహిళా సంఘాలు, పంచాయతీ రాజ్, ఇతర సామాజిక సంస్థలు ఇందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు.
ఇదే ఏడాది 'బేటీ బచావో బేటీ పడావో' ప్రచారాన్ని విస్తృతం చేసినందుకు ఈ జిల్లా యంత్రాంగం రెండు జాతీయ అవార్డులు అందుకుంది.
"మేము చేసే ప్రతి కార్యక్రమంలో 'బేటీ బచావో- బేటీ పడావో' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. లింగ భేదం అనేది ఇంకా ఉంది. ప్రజల్లో అవగాహన పెంచాలి."
-రిగ్వేద్ ఠాక్రే, జిల్లా కలెక్టర్.
ఇదీ చూడండ : లైవ్ వీడియో: క్షణంలో జింకను పట్టేసిన కొండచిలువ