ETV Bharat / bharat

ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధం: రజనీ, కమల్​

తమిళనాట కొత్త పొత్తుకు అడుగులు పడనున్నాయా? అవును.. సూపర్​స్టార్​ రజనీ కాంత్​, విశ్వనటుడు కమల్​ హాసన్​ కలసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సూపర్​స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను విశ్వనటుడు, మక్కల్​ మీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్​హాసన్ సమర్థించారు. తమిళ ప్రజల ప్రయోజనం కోసం తాము చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు రెడీ: రజనీ, కమల్​
author img

By

Published : Nov 19, 2019, 9:02 PM IST

'పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఓ ఆశ్చర్యం' అని సూపర్​స్టార్​ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మక్కల్ నీది మయ్యమ్​ వ్యవస్థాపకుడు, విశ్వనటుడు కమల్​హాసన్​ సమర్థించారు. రజనీకాంత్​ వ్యాఖ్యలు 'విమర్శ కాదు వాస్తవికత' అని కమల్​ అభిప్రాయపడ్డారు.

ప్రజల కోసం కలిసి పనిచేస్తాం!

తమిళనాడు సంక్షేమం కోసం రజనీకాంత్​తో చేతులు కలపడానికి తాను సిద్ధమేనని, అయితే రాజకీయంగా అది వీలవుతుందో లేదో చెప్పలేమని కమల్ అన్నారు. తాము సినీ పరిశ్రమలో మాత్రం 44 ఏళ్లుగా కలిసే ఉన్నామని కమల్​ పేర్కొన్నారు.

కమల్​ వ్యాఖ్యలపై కాసేపటికే స్పందించిన రజనీ... ప్రజల కోసం అవసరమైతే తామిద్దరం కచ్చితంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

మంచి నేత కావాలంటే..

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొటాబయ రాజపక్స... మంచి నేతగా పేరుపొందాలంటే.. సమాజంలోని అన్ని వర్గాలకూ సమాన న్యాయం చేకూర్చాలని కమల్​హాసన్​ అభిప్రాయపడ్డారు.

అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి

కమల్​హాసన్ సినిమా పరిశ్రమకు వచ్చి 60 ఏళ్లు గడిచిన సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో రజనీకాంత్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

" ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఆయన ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే."- రజనీకాంత్, ప్రముఖ నటుడు

మండిపడ్డ ఏఐఏడీఎంకే

రజనీకాంత్​ వ్యాఖ్యలపై అధికార ఏఐఏడీఎంకే తీవ్రంగా స్పందించింది. పళనిస్వామి అనుకోకుండా ముఖ్యమంత్రి కాలేదని, స్వయంకృషితో ఉన్నతస్థానాన్ని అధిరోహించారని పేర్కొంది.

మహానటులు కలుస్తారా?

కమల్​హాసన్ ఇప్పటికే ఎమ్​ఎన్​ఎమ్​ పార్టీ స్థాపించి రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించారు. 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఇద్దరు నటులు కలిసి ముందుకు వెళ్తారా? లేదా? చూడాలి.

ఇదీ చూడండి: 'గాంధీ'ల భద్రత కోసం కొత్తగా వెయ్యి మంది జవాన్లు!

Kolkata, Nov 19 (ANI): Indian and Bangladesh cricket teams on November 19 arrived at Netaji Subhash Chandra Bose International Airport in Kolkata. 'Men in blue' are ready to face the 'Bangla Tigers' in 1st ever Test in day-night format. India defeated Bangladesh in the first Test handsomely by an innings and 130 runs. Pink ball will be used instead of red. 2nd match will commence on November 22.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.