ఆదివారం నలుగురు రాజకీయ నేతలకు నిర్బంధం నుంచి విడుదల చేసింది జమ్ముకశ్మీర్ యంత్రాంగం. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాల నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్న వీరిని బయటకు వెళ్లకూడదని, ఇళ్లలోనే ఉండాలన్న షరతులతో నిర్బంధం నుంచి సడలింపు కల్పించింది.
నిర్బంధం నుంచి విడుదలైన వారిలో ఎన్సీ(నేషనల్ కాన్ఫరెన్స్)కి చెందిన అబ్దుల్ మజీద్ భట్ లర్నీ, గులామ్ నబీ భట్, మహమ్మద్ షఫీ.. పీడీపీ నాయకుడు మహమ్మద్ యూసఫ్ భట్ ఉన్నారు.
ఆంక్షల నడుమ
గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370రద్దు అనంతరం శాంతి భద్రతల దృష్ట్యా కశ్మీర్‌లోని పలువురు ముఖ్యనేతలు, సామాజిక కార్యకర్తలను నిర్బంధించారు అధికారులు. అప్పటి నుంచి వారందరు గృహ నిర్బంధంలోనే ఉన్నారు.
శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల నిర్బంధంలో ఉన్న 34 మంది రాజకీయ నాయకులను ఎమ్మెల్యే వసతి గృహాలకు తరలించారు.
జమ్మూ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సజ్జద్ ఘనీ లోని ఇంకా నిర్బంధంలోనే కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి :ఆకర్షనీయ పథకాలతో కాంగ్రెస్ 'దిల్లీ' మేనిఫెస్టో