ETV Bharat / bharat

రివ్యూ 2019 : నింగిలో నిరాటంకంగా దూసుకెళ్లిన 'ఇస్రో'

గగనతలంలో భారత మువ్వన్నెల జెండా చిరస్థాయిగా రెపరెపలాడేలా 2019లో పలు ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. వ్యవసాయం, అటవీ, పౌర, కమ్యూనికేషన్​, రక్షణ, భూ పరిశీలన తదితర ఉపగ్రహాలతో దాదాపు 99శాతం అనుకున్న లక్ష్యాలను సాధించింది. మరి ఈ ప్రయోగాలను ఇస్రో ఎప్పుడు చేపట్టిందో.. వాటితో దేశానికి కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

ISRO has launched a total of 7 satellites in 2019, here is a list of all 7 satellites and a brief
రివ్యూ 2019 : నింగిలో నిరాటంకంగా దూసుకెళ్లిన 'ఇస్రో'
author img

By

Published : Dec 27, 2019, 8:02 AM IST

నింగిలో నిరాటంకంగా దూసుకెళ్లిన 'ఇస్రో'

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం-ఇస్రో చరిత్రలో మరపురాని ఏడాదిగా 2019 మిగిలిపోనుంది. ఈ ఏడాదిలో ఇస్రో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించగా.. అందులో దాదాపు ప్రతిదీ విజయవంతమైంది. చంద్రయాన్​-2 కూడా 98శాతం అనుకున్న లక్ష్యాలను ఛేదించింది. ఈ తరుణంలో జనవరిలో నింగిలోకి దూసుకెళ్లిన 'మైక్రోశాట్​-ఆర్'​ నుంచి మొన్నటి 'రీశాట్​-2బీఆర్​1' వరకు ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి ప్రయోజనాలు, ఫలితాలపై ఓ లుక్కేద్దాం..

1. మైక్రోశాట్​-ఆర్​

ప్రయోజనం : ఇమేజ్​ సెన్సింగ్ ఉపగ్రహమైన మైక్రోశాట్‌-ఆర్‌.. దేశ రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవోకు సహకరిస్తుంది. దీనితో పాటు తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన కమ్యూనికేషన్​ శాటిలైట్​(కలాంశాట్​)ను కూడా ప్రయోగించారు.

శాటిలైట్​ వాహకం : పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - సీ44

ఎప్పుడు : 2019 జనవరి 24, రాత్రి 11.37 గంటలకు

ఎక్కడ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ​ధవన్​ అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్​ ​

2. జీశాట్​-31

ప్రయోజనం : మొబైల్​ నెట్​వర్క్, ఏటీఎం, వీశాట్‌ నెట్‌వర్క్స్‌, టెలివిజన్‌ అప్‌లింక్స్‌, డిజిటల్‌ శాటిలైట్‌, డీటీహెచ్‌ టెలివిజన్‌, సెల్యులార్‌ బ్యాకప్‌ తదితర కమ్యూనికేషన్​ సేవలను మరింత మెరుగుపరుస్తుంది. 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించగలదు.

శాటిలైట్​ వాహకం : ఏరియానా స్పేస్‌ రాకెట్‌

ఎప్పుడు : 2019 ఫిబ్రవరి 6, తెల్లవారుజామున 2.31 గంటలకు

ఎక్కడ : ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు లాంచ్‌ కాంప్లెక్స్‌

3. ఇమీశాట్​

ప్రయోజనం : శత్రుదేశాల రాడార్లను సులువుగా పసిగట్టగలదు. అలాగే మన కదలికలను గుర్తుపట్టకుండా శత్రు శిబిరాల్లో కమ్యూనికేషన్‌ సౌకర్యాలు నెలకొల్పేందుకు ఉపకరిస్తుంది. ఇమీశాట్​ సాయంతో చొరబాటుదారులను సులువుగా గుర్తించొచ్చు.

శాటిలైట్​ వాహకం : పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - సీ45

ఎప్పుడు : 2019 ఏప్రిల్​ 1

ఎక్కడ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ​ధవన్​ అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్​

4. రీశాట్​-2బీ

ప్రయోజనం : భూ పరిశీలనకు ఉపయోగపడుతుంది, ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు నిరాటంకంగా సేవలందిస్తుంది.

శాటిలైట్​ వాహకం : పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - సీ46

ఎప్పుడు : మే 22, 2019

5. చంద్రయాన్​-2

కోట్లాది భారతీయులు గర్వపడేలా అమెరికా, రష్యాలకు సైతం సాధ్యం కాని ప్రయోగానికి 2019 జులై 22న శ్రీకారం చుట్టింది ఇస్రో. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొట్టమొదటి సారి కాలు మోపేందుకు చంద్రయాన్​-2 నింగిలోకి దూసుకెళ్లింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్​ ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయాయి. అయినప్పటికీ చంద్రయాన్​-2 ద్వారా 98శాతం విజయం సాధించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

6. కార్టోశాట్​-3

ప్రయోజనం : ప్రపంచ చరిత్రలోనే అత్యంత రిజల్యూషన్‌తో భూమి ఛాయా చిత్రాలను తీసే శక్తిమంతమైన ఉపగ్రహం. అలాగే శత్రువుల కదలికలు, స్థావరాలపై నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు దోహదపడుతుంది.

శాటిలైట్​ వాహకం : పీఎస్‌ఎల్‌వీ సీ-47 ద్వారా ప్రయోగించారు.

ఎప్పుడు : 2019 నవంబరు 27

7. రీశాట్​-2బీఆర్​1

ప్రయోజనం : ఎక్స్‌-బ్యాండ్‌ రాడార్‌ 8 నుంచి 12 గిగాహెర్ట్జ్​ పౌనఃపున్యాల మధ్య ఉండే తరంగాలను పరిశీలిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఈ ఉపగ్రహం జాతీయ రక్షణ, పౌర, వ్యవసాయ, అటవీ, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించనుంది.

శాటిలైట్​ వాహకం : పీఎస్‌ఎల్‌వీ-సీ48 (పీఎస్​ఎల్​వీ క్యూఎల్​ తరహా రాకెట్​)

ఎప్పుడు : 2019 డిసెంబరు 11, మధ్యాహ్నం 3.25 గంటలకు

ఎక్కడ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ​ధవన్​ అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.