పొట్ట కూటి కోసం.. ఎన్నో అవమానాలు భరించిన ట్రాన్స్జెండర్లు తలుచుకుంటే ఏదైనా సాధిస్తామని నిరూపిస్తున్నారు. భిక్షాటన వదిలి విద్యా, ఉద్యోగాల్లో అర్హత సంపాదించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే.. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ అటవీ అధికారిగా నియమితురాలైంది తమిళనాడుకు చెందిన దీప్తి.
కుమారుడు కూతురిగా ఎదిగితే..
సుబ్రమణికి కుమారుడిగా జన్మించిన సుతన్రాజ్ తరువాత దీప్తిగా పేరు మార్చుకుంది. దీప్తి తండ్రి 2007లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నీలగిరి అటవీ శాఖలో ఉద్యోగం చేసిన తన తండ్రి స్థానంలో తనకు ఉద్యోగం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. ఐదేళ్లుగా ఎంతో ప్రయత్నించింది.
బీకామ్‌లో డిగ్రీ పూర్తి చేసిన దీప్తి.. ప్రభుత్వ ఉద్యోగం పొందాలని నిరంతరం కష్టపడేది. ఇన్నేళ్లకు తన కష్టం ఫలించింది. ఎట్టకేలకు తండ్రి స్థానంలో ఉద్యోగంలో చేరాలని తమిళనాడు ప్రభుత్వం తనకు నియామక పత్రం పంపింది.
ఇదీ చదవండి:దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ నర్స్‌గా అన్బూ రూబీ
ఇదీ చదవండి:'ఉన్నావ్ బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం చేస్తాం'