మాట మార్చేశారు
కర్తార్‌పుర్ నడవా భారత్‌లోని డేరా బాబా నానక్ నుంచి దర్బార్ గురుద్వారా సాహిబ్‌ను కలుపుతుంది. ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 4 కిలోమీటర్లు ఉంటుంది.
కర్తార్‌పుర్ గురుద్వారా సాహిబ్‌ను దర్శించుకునేందుకు పాస్‌పోర్ట్ అవసరం లేదని, ఏదైనా ఒక గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నవంబర్ 1న ప్రకటించారు. అయితే... భారత్-పాక్ మధ్య జరిగిన ఒప్పందంలో ఈ విషయం ఎక్కడా లేదు. అందుకే యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరమా లేదా అని స్పష్టం చేయాలని పాకిస్థాన్‌ను బుధవారం కోరింది భారత్. ఒక రోజు తర్వాత పాక్ సైన్యం స్పందించింది. పాస్‌పోర్ట్ తప్పనిసరని తేల్చిచెప్పింది.
"మాకు భద్రతా సంబంధిత ఆంక్షలు ఉన్నాయి. పాస్‌పోర్ట్ ఆధారిత ప్రవేశమే చట్టబద్ధమైనది. భద్రత, సార్వభౌమత్వంలో రాజీ పడేది లేదు."
-మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, పాకిస్థాన్ సైన్యం అధికార ప్రతినిధి
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా కర్తార్‌పుర్ నడవా గురుద్వార్ దర్బార్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రారంభించనున్నారు. భారతీయ సిక్కులకు పాస్‌పోర్ట్ సహిత, వీసా రహిత ప్రవేశం కల్పిస్తోంది పాక్.
ఇదీ చదవండి: 'కర్తార్‌పుర్ యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరం లేదు'