కీలక అంశాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని భారత్, జర్మనీ నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 5వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశమయ్యారు మోదీ.
ఇద్దరు దేశాధినేతల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత మోదీ, మెర్కెల్ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో 5 తీర్మానాలు, 11 ఒప్పందాలు కుదిరినట్లు మోదీ తెలిపారు.
"2022 నాటికి సరికొత్త భారత్‌ను నిర్మిస్తామని హామీ ఇస్తున్నాం. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ముందున్న జర్మనీ లాంటి దేశాల సహకారంతోనే ఇది సాధించగలం. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని నిర్మూలించేందుకు రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం చేయాలని తీర్మానించాం. ఈ-మొబిలిటీ, ఆకర్షణీయ నగరాలు, నదుల ప్రక్షాళన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఒప్పందాలపై మెర్కెల్ హర్షం
ఒప్పందాలను పరిశీలిస్తే అత్యాధునిక సాంకేతిక రంగంలో రెండు దేశాలు కలిసి సాగుతున్న తీరు అర్థమవుతుందని మెర్కెల్ అభిప్రాయపడ్డారు. 5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో సహకారానికి ఉన్న అవరోధాలను అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. భారత్‌తో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగం కావటానికి సిద్ధమన్నారు మెర్కెల్.
ఇదీ చూడండి: రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి మెర్కెల్ నివాళి