కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి భారత్-పాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జీరో పాయింట్ వద్ద గురువారం ఇరుదేశాలు అధికారులు సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్రం తరఫున హోంశాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి హాజరయ్యారు.
కర్తార్పుర్పై భారత్-పాక్ మధ్య బుధవారం ఒప్పందం జరగాల్సి ఉంది. అయితే యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న పాక్ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని భారత్ కోరినందున ఒకరోజు ఆలస్యమైంది.
అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్‌లోని డేరాబాబానానక్ గురుద్వారా నుంచి కర్తార్‌పుర్‌ను కలుపుతూ కారిడార్ నిర్మించారు. గురునానక్ 550వ జయంతి వేడుకలను పురస్కరించుకొని వచ్చే నెల మొదటివారంలో కర్తార్‌పుర్ కారిడార్‌ను ప్రారంభించాలని భారత్-పాక్ నిర్ణయించాయి.
ఇదీ చూడండి: దంగల్-19: 'హంగ్ కింగ్' కోసం అగ్రపార్టీల ఆపరేషన్ ఆకర్ష్