గుజరాత్‌లోని థోరాలాలో శుక్రవారం అర్ధరాత్రి ఓ కామాంధుడు ముక్కుపచ్చలారని 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లితో కలిసి థోరాలాలోని ఒక పార్కులో ఆ చిన్నారి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలికను అపహరించుకు వెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ముందు ఒంటరిగా వచ్చి.. పాపను తీసుకుని రోడ్డు దాటి వెళ్లాడు మృగాడు. ఆ తరువాత కొద్ది సేపటికి చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లిని చేరిన దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.
ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి కూలి పని చేసుకొని జీవిస్తోంది. తన కుమార్తెపై జరిగిన దారుణాన్ని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల పారితోషికం ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఇదీ చదవండి:ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!