భారత్-శ్రీలంక మధ్య అత్యున్నత స్థాయిలో మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. భద్రత, ప్రజాసంక్షేమం లక్ష్యంగా ఇరుదేశాలు కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు.
మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీ విచ్చేసిన లంక అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతం పలికారు.
మోదీ, డోభాల్‌తో సమావేశం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్‌తో హైదరాబాద్ హౌస్ వేదికగా విడివిడిగా సమావేశమయ్యారు రాజపక్స. ఇరుదేశాల మధ్య భద్రత, ఇతర రంగాల్లో సహకారంపై చర్చించారు.
మహాత్ముడికి నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ను సందర్శించిన గొటబాయ బాపూజీకి నివాళులు అర్పించారు. మహాత్ముడు అందరికీ స్ఫూర్తి అని సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు.
పొరుగుదేశం శ్రీలంక నూతన అధ్యక్షుడిగా పది రోజుల క్రితం ఎన్నికైన గొటబాయ రాజపక్స తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకున్నారు.
ఇదీ చూడండి: 'గాడ్సే' వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రగ్యా సింగ్ క్షమాపణలు