ETV Bharat / bharat

జేఎన్​యూ ఫీజుల పెంపుపై విద్యార్థుల పోరు తీవ్రం

దిల్లీలో జేఎన్​యూ విద్యార్థులు ఫీజుల పెంపుపై నిరసనలు కొనసాగించారు. ఆందోళనల కారణంగా విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి​ సమావేశ వేదికను మార్చవలసి వచ్చింది.

జేఎన్​యూ ఫీజుల పెంపుపై విద్యార్థుల పోరు తీవ్రం
author img

By

Published : Nov 13, 2019, 4:30 PM IST

జేఎన్​యూ ఫీజుల పెంపుపై విద్యార్థుల పోరు తీవ్రం

ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ దిల్లీ జవహర్​లాల్ నెహ్రూ​ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసనలు తీవ్రతరం చేశారు. ఉపకులపతి కార్యాలయం, ఇతర ప్రధాన కార్యాలయాలు ఉండే ప్రదేశంలో ఆందోళనలు చేపట్టారు. జేఎన్​యూ వీసీ, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా కార్యనిర్వాహక మండలి సమావేశం వేదికను మార్చింది జేఎన్​యూ అధికార యంత్రాంగం. విశ్వవిద్యాలయం ప్రాంగణం లోపల జరగాల్సిన భేటీని దిల్లీలో వేరే ప్రాంతంలో నిర్వహిస్తోంది.

జేఎన్​యూకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కార్యనిర్వాహక మండలి తీసుకుంటుంది.

ఇవీ డిమాండ్లు...

ఫీజుల పెంపునకు సంబంధించి ఇటీవలే ముసాయిదా నిబంధనావళి రూపొందించింది జేఎన్​యూ. హాస్టల్ గది అద్దెను 30 రెట్లు పెంచడం సహా కొత్తగా సేవా రుసుము వసూలు, సెక్యూరిటీ డిపాజిట్ పెంపు వంటి ప్రతిపాదనలు చేసింది. వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్​తో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

ఇదీ చూడండి : బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ చేరుకున్న మోదీ

New Delhi, Nov 13 (ANI): Air quality is continuously deteriorating in the national capital. To curb the air pollution, New Delhi Municipal Council (NDMC) sprinkled water. They sprinkled water in the area around Feroz Shah Road to settle the dust. Air quality has reached 'severe' category in Delhi. To curb air pollution, Chief Minister Arvind Kejriwal-led government in Delhi had announced implementation of odd-even scheme from Nov 04-15.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.