ETV Bharat / bharat

'మోదీజీ.. మహిళలకు మీరిచ్చే సందేశం ఇదేనా? - మోదీ తాజా వార్తలు

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై భాజపా నేతలు చేస్తున్న అభ్యంతరకర వాఖ్యలను నిరసిస్తూ.. మహిళా సంఘాల కార్యకర్తలు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. కమలం పార్టీ నాయకులు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతుంటే ప్రధానిగా మీరు ఏం చేస్తున్నారంటూ లేఖలో ప్రశ్నించారు. అత్యాచార ఘటనలను  ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా చేసుకునేంత స్థాయికి భాజపా దిగజారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Hate speeches made by BJP leaders using 'fear of rape as campaign message': Women's groups to PM
'మోదీజీ.. మహిళలకు మీరిచ్చే సందేశం ఇదేనా?
author img

By

Published : Feb 3, 2020, 5:19 PM IST

Updated : Feb 29, 2020, 12:52 AM IST

భాజపా నాయకులు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారంటూ 170 మందికిపైగా మహిళా సంఘాల కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకీ బహిరంగ లేఖ రాశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అత్యాచార ఘటనలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై భాజపా నాయకులు తమ అనుచరులను హింసకు ప్రేరేపించడం ఏంటని ప్రశ్నించారు.

" అత్యచార ఘటనలను భాజపా నాయకులు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను బెదిరిస్తున్నారు. ఈ రకమైన విద్వేషాలు దేనికి? ప్రభుత్వాధినేతగా మీరు ఇలాంటివి ప్రోత్సహిస్తారా? భాజపాకు ఓటు వేయకపోతే అత్యాచారానికి గురవుతారు అని అంటున్నారు. ఇదేనా దిల్లీ మహిళలకు మీరిచ్చే ఎన్నికల సందేశం. ఎన్నికల్లో గెలుపుకోసం మీ పార్టీ ఎంతకైనా తెగిస్తుందా?"

- లేఖలో మహిళా సంఘాలు

భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ.. మహిళలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను.. కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ 'దేశ ద్రోహులను కాల్చమని' అన్న మాటలను లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.

ఇవన్నీ గెలిచేందుకు చేసే ప్రయత్నాలేనా?

శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై ప్రభుత్వం భద్రతా దళాలతో దాడి చేయించిందని మహిళా సంఘాలు ఆరోపించాయి. దిల్లీలో ప్రస్తుతం నెలకొన్న హింసాత్మక పరిస్థితులను చూసి అన్ని మతాలకు చెందిన మహిళలు భయపడుతున్నారని.. ఇదంతా అక్కడి నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు చేసే ప్రయత్నాలేనన్నారు.

ఇరువురికి నోటీసులు జారీ..

ఇటీవలే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్​, భాజపా ఎంపీ పరవేష్​ వర్మ.. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం వారికి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి:- 'బ్రేకప్'​ను నిలదీసిన ప్రియుడిపై యువతి హత్యాయత్నం

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/cpm-cpi-gives-suspension-of-business-notice-in-rajya-sabha-citing-prevailing-situation-over-nrc20200203111101/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 12:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.