హరియాణాలో ఇటీవల నిర్వహించిన జనతా దర్బార్‌లో ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్‌కు ఒక వింత సంఘటన ఎదురైంది. ఈ కార్యక్రమానికి ఒక మహిళ ఏడుస్తూ వచ్చింది. రెండేళ్ల క్రితం తన భర్తను తానే హత్యచేశానని, అందుకు తనకు శిక్ష విధించమని కోరింది. మొదట ఆశ్చర్యపోయిన మంత్రి, అనంతరం అమెను పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
''మాకు ఫిర్యాదు అందింది. భర్త మరణానికి తానే కారణమని ఆ మహిళ చెప్పారు. తాను తప్పు చేశానంటూ మంత్రి వద్ద ఆమె లిఖితపూర్వకంగా అంగీకరించారు. ఆ మేరకు మేము ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం. అనంతరం కేసు దర్యాప్తు చేపడతాం'' అని మహేష్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి సతీష్ కుమార్ తెలిపారు.