హరియాణాలో ఏడుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. భాజపా జోరు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో నినదించినప్పటికీ.. కాంగ్రెస్-కమలం మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.
మహారాష్ట్రలో ఫలితం అనుకున్నట్లు లేకపోయినా... హరియాణాలో పట్టు బిగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇప్పటికే హంగ్ ఛాయలు కనపడుతుండటం వల్ల... కాంగ్రెస్ అధినాయకత్వం కింగ్‌మేకర్ జేజేపీతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు సమాచారం. స్వయంగా సోనియాగాంధీ... సీనియర్ నేత భూపీందర్ సింగ్ హుడాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు...
ప్రస్తుత సరళిని చూస్తే ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. జన్‌నాయక్ జనతా పార్టీ కింగ్‌మేకర్ పాత్ర పోషించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు కూడా కీలకం కానున్నారు.
2014లో...
2014లో హరియాణాలో 90 స్థానాలకుగాను భాజపా 47 సీట్లలో గెలుపొందగా, కాంగ్రెస్15 స్థానాలు, ఐఎన్ఎల్డీ 19 సీట్లలో విజయం సాధించాయి.
- ఇదీ చూడండి: దంగల్ 2019: 'హంగ్' దిశగా హరియాణా!