ఏ పెళ్లిలోనైనా కట్నం దగ్గర కానీ, భోజనం విషయంలో కానీ పెళ్లికొడుకు ఆగ్రహించటం, అలగటం మనం చూస్తుంటాం. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మాత్రం ఓ సిల్లీ కారణంతో పెళ్లినుంచి పారిపోయాడు ఓ వరుడు. కారణమేంటి అనుకుంటున్నారా? వధువు తరఫున కుటుంబంవారు తాను చూపించిన చీర కొనలేదనే కారణంతో అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
బిదరెకేరె గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు.. అదే ఊరికి చెందిన ఓ అమ్మాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వివాహానికీ అంగీకరించాయి. పెళ్లి రోజు కూడా నిశ్చయించారు. అయితే చీర కోసం అలిగిన రఘు... పెళ్లిరోజు పారిపోయాడు. ప్రస్తుతం వధువు కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు.